రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

-

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు వడ్డించే అల్పాహారాన్ని పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యార్థులకు వడ్డించారు.

మరోవైపు హైదరాబాద్ వెస్ట్​మారేడ్ పల్లిలో సీఎం బ్రేక్​ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు టిఫిన్ వడ్డించిన కేటీఆర్.. వారితో కలిసి బ్రేక్​ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. బ్రేక్​ఫాస్ట్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు అమీర్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. సోమవారం ఇడ్లీ సాంబeరు లేదా గోధుమ రవ్వ, మంగళవారం పూరి ఆలుకుర్మ లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా సాంబరు లేదా బియ్యంతో చేసిన రవ్వ కిచిడి, గురువారం చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ సాంబరు లేదా పొంగల్ సాంబరు, శుక్రవారం ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ లేదా గోధుమ రవ్వ కిచిడి, శనివారం పొంగల్ సాంబరు లేదా కూరగాయలతో చేసిన పులావ్ ను విద్యార్థులకు అల్పాహారంగా అందించనున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version