బీహార్ టూర్… కొత్త గెటప్ లో సీఎం కేసీఆర్… సింగ్ ఇజ్ కింగ్

-

నిన్న సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం కే చంద్రశేఖర్‌ రావు అందించారు.

హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగిస్తూ.. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించి పోతుందన్నారు.

దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం… ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌.. పాట్నాలోని గురుద్వారను సందర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ తేజస్వి యాదవ్‌తో పాటు గురుద్వారకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ్ గెటప్ లో కనిపించే అందరిని కనువిందు చేశారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news