కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్..వాళ్లది చిల్లర వ్యవహారం

-

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వాళ్లదంతా చిల్లర వ్యవహారమని ఆగ్రహించారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదని అభిప్రాయ పడ్డారు సీఎం కేసీఆర్‌. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని స్ఫష్టం చేశారు.

రోజువారీ కూలీ డబ్బులు కూడా.. నేరుగా కేంద్రమే పంచాలనుకోవడం సరైందా?అని నిలదీశారు. కరెంటు, తాగునీరు లేక జనం రోడ్డెక్కుతున్నారని.. విద్య, వైద్య రంగాల్లో ఆశించిన ప్రగతి లేదని నిప్పులు చెరిగారు. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకుంటోందని సీఎం కెసిఆర్ మండిపడ్డారు.

విధ్వంసానంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని అని, ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదనీ, అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news