మల్లారెడ్డి అల్లుడికి మల్కాజిగిరి BRS టికెట్

-

మంత్రి మల్లారెడ్డి అల్లుడికి మల్కాజిగిరి BRS టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధం అయ్యారని సమాచారం అందుతోంది. మల్కాజ్గిరి బిఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఇవ్వాలని నిర్ణయించారట సీఎం కేసీఆర్. దీనిపై నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్.

CM KCR has decided to give Malkajigiri ticket to Marri Rajasekhar Reddy

రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడు. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మరి రాజశేఖర్ రెడ్డి.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నారట. ఇక మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన నేపథ్యంలో మల్కాజిగిరి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్‌ వరించనుంది. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే… నిన్న రాత్రి మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version