పైకి పార్టీల మధ్య విభేదాలున్నా
సైద్ధాంతిక విభేదాలున్నా కూడా
కొన్ని విషయాల్లో కొందరు కొందరికి చేరువ
అని చెప్పే ప్రయత్నం ఈ కథన రూపాన…చదువుండ్రి!
యాదాద్రి భువనగిరి దారుల్లో కేసీఆర్ (ఫిబ్రవరి 12న), హైద్రాబాద్ దారుల్లో కేసీఆర్ (ఇప్పుడు), మహారాష్ట్ర దారుల్లో, ముంబయి నగర వీధుల్లో కేసీఆర్ (ఫిబ్రవరి 20న) అక్కడని ఇక్కడనీ కాదు మన బర్త్ డే బోయ్ ఎక్కడయినా రాణించగలరు.ఆయనేం అనుకున్నా సాధించగలరు.అందుకు తార్కాణాలెన్నో! అందుకు నిదర్శనాలూ ఎన్నో! ఆయనేం చెప్పినా అందుకు తగ్గ గణాంకాలు,ఆధారాలు ఉంటాయి.శ్రీకాకుళం జిల్లాలో కేంద్రం ఆదేశాల మేరకు బిగించిన విద్యుత్ మీటర్ల లెక్క కూడా హరీశ్ రావు కన్నా బాగా చెప్పగలరు.అంతేకాదు మారుమూల ఆదిలాబాద్ తండాల్లో ఏం జరుగుతోంది అన్నది వివరించడం ఆయనకే సాధ్యం. మేడారం జాతరకు ఎన్ని బస్సులు వెళ్తాయి వాటి లెక్కేంటి? అందులో వచ్చే ఆదాయం ఎంత? అన్నవి గణాంకాలతో సహా చెప్పే దమ్మున్న వాడు.. ధారణ ఉన్న వాడు కేసీఆర్..
అందుకే రాజకీయాలకు అతీతంగా అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ ఆయనకు అభిమానులున్నారు. అదేవిధంగా మొన్నటి భువన గిరి పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆ రోజు కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. భువనగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని ఆ రోజు సభాముఖంగా చెప్పారు కేసీఆర్.ఆ రోజు వరాల జల్లు కురిపించారు కేసీఆర్.ఇక్కడి యాదాద్రి క్షేత్రాభివృద్ధికి తానెంతో కృషి చేస్తానని కూడా అన్నారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై ప్రేమలోనే ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ పై బీజేపీకి చెందిన అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ ఖండించారు. కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ దారిలోనే ఉన్నారన్నది సత్యం.అందుకు హుజురాబాద్ ఎన్నికలే సాక్ష్యం. ఈ విధంగా కోమటి రెడ్డి,ఇటు రేవంత్ రెడ్డి ఇంకా చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రా సీఎం) ఈ విధంగా ముఖ్యమయిన రెడ్డి సామాజిక వర్గ నాయకులంతా ఇవాళ కేసీఆర్ కు మద్దతుదారులే!ఆ మాటకు వస్తే ఆయన ప్రయత్నిస్తే ఆంధ్రా రాజకీయాల్లో అత్యంత సులువుగానే పేరు తెచ్చుకోవడం ఖాయం.ఓ విధంగా కోమటి రెడ్డికీ, రేవంత్ రెడ్డికీ సైద్ధాంతిక విభేదాలున్నాయి.
కానీ ఈ ఇద్దరూ చాలా సందర్భాల్లో కేసీఆర్ కు చేరువ అన్నది నిరూపణ అయిన విషయం.ఓ విధంగా రేవంత్ రెడ్డికీ,జగన్ మోహన్ రెడ్డికీ విభేదాలు ఉన్నాయి.ముఖ్యంగా ఓటుకు నోటు కేసును తమకు అనుగుణంగా రాజకీయ లబ్ధికి వాడుకున్నది జగనే అన్నది కాదనలేని వాస్తవం. కానీ ముఖ్యమయిన సందర్భాల్లో ఈ ఇద్దరూ కూడా జగన్ కు దగ్గర వారే అన్నది ఎన్నో పరిణామాలలో నిరూపణలో ఉన్న వాస్తవం.
ఇక కిషన్ రెడ్డి లాంటి నేతలు పైకి గాంభీర్యం చూపినా కూడా ఆయన కూడా ఓ విధంగా ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ కు సాయం చేసిన మనిషే అన్నది ఓ పొలిటికల్ రూమర్. వీరందరితో పాటు ఓవైసీ సోదరులు కూడా కేసీఆర్ తోనే ఉంటారు. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలకూ చెందిన నాయకులకు ఇవాళ కేసీఆర్ ఓ ప్రత్యేక ఆకర్షణ..ఇంకా చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకూ ఆయనే పెద్ద దిక్కు అన్నది ఓ అంగీకరించదగ్గ నిజం.కనుక కోమటి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ జగన్ మోహన్ రెడ్డి కానీ ఆయనకు అత్యంతbసన్నిహితులే! కానీ రాజకీయంగా సైద్ధాంతికంగా ఉండే విభేదాలు మాత్రమే పైకి ఆ విధంగా మాట్లాడేందుకు ఆస్కారం ఇస్తాయన్నది మరో అంగీకరించదగ్గ నిజం.ఆఖరుగా చిరంజీవి,పవన్ కూడా కేసీఆర్ సన్నిహితులే అన్నది ఓ యథార్థ సత్యం. ఏదేమయినప్పటికీ పార్టీలకు అతీతంగా,ప్రాంతాలకు అతీతంగా రాణించేందుకు తన శక్తి వంచన లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఇరవై ఏళ్లుగా అలుపెరుగక ప్రయాణిస్తున్న కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు.
– రత్నకిశోర్ శంభుమహంతి
తెలంగాణ పొద్దు – మన లోకం ప్రత్యేకం