త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభం – సీఎం కేసీఆర్

-

త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభం కానుందని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. నూతనంగా నిర్మితమౌతున్న డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపచేసే దిశగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సీఎం తెలిపారు. ఈ రోజు తుది దశకు చేరుకుంటున్న తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని సీఎం పర్యవేక్షించారు.

సచివాలయం ప్రధాన ద్వారం దగ్గరునుంచి పై అంతస్తు వరకు పరిశీలించిన సీఎం, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం ఎలివేషన్ సహా, ఇటీవల బిగించిన డోములను, దోల్ పూర్ స్టోన్ తో రూపొందించిన వాల్ క్లాడింగ్ తదితర అలంకరణలను సీఎం కలియతిరిగి పరిశీలించారు. సచివాలయానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలను, కాంపౌండ్ వాల్స్ ను, వాటికి అమరుస్తున్న రైలింగులను, సుందరంగా రూపుదిద్దుకుంటున్న వాటర్ ఫౌంటేన్లను, లాన్ లను, స్టేర్ కేస్ లను సీఎం క్షుణ్ణంగా పరీక్షించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఉన్నతాధికారులు సిబ్బంది సందర్శకుల వాహనాల ప్రవేశ ద్వారాలను పార్కింగు స్థలాలను తుది దశకు చేరుకుంటున్న వాటి నిర్మాణాలను సీఎం పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news