హిజాబ్ వివాదంపై ప్రధానియే కాదు.. దేశమే మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేమిటని..కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగే పరిణామాలు మనకు వాంఛనీయమా..? అని ప్రశ్నించారు. మతం పేరుపై ధర్మం పేరుపై దాన్ని ప్రోత్సహిస్తామా.. అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్నికలు వస్తే అప్పడు సరిహద్దుల్లో ఘర్షణ లేవనెత్తండి.. ధర్మం పేరుతో అల్లర్లు చేయాలంటూ.. జనాల భావోద్వేగాలను రెచ్చగొట్టండి ఓట్లను పొందడం బీజేపీ అలవాటు అయిందని విమర్శించారు. ఇటువంటివి దేశానికి మంచిది కాదని.. ఇటువంటి రాజకీయాలు బంద్ కావాలని.. ఆయన అన్నారు. మనదేశం వికాస పథంలో వెళ్లాలని ఆయన అన్నారు. ఈ తరహా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రబలమైన మార్పు జరగాలంటే.. మంచిగా పరివర్తనం చెందాలంటే.. జనాలు మార్పు, జాగరూకతతో వ్యవహరించాలని కోరారు. బీజేపీని పారద్రోలాలని ఆయన పిలుపు నిచ్చారు.
హిజాబ్ వివాదంపై ప్రధానియే కాదు దేశమే మౌనమే వహిస్తోంది…: సీఎం కేసీఆర్
-