హైదరాబాద్‌ లో భారీ వర్షం…విద్యుత్‌ వైర్లు తగిలి కానిస్టేబుల్‌ మృతి..

-

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. గోల్నాక, యూసఫ్ గూడ, లక్డీకపూల్, వనస్థలిపురం, మల్లాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, విద్యానగర్, ఎల్బీనగర్, కాచిగూడ, అమీర్పేట, బోరబండ, గచ్చిబౌలి, అంబర్పేట, రాయదుర్గం, హబ్సిగూడ, తార్నాక, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అయితే, హైదరాబాద్‌ లో భారీ వర్షం కారణంగా…విద్యుత్‌ వైర్లు తగిలి కానిస్టేబుల్‌ మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. బైకుపై వెళ్తుండగా వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర జారిపడ్డాడు కానిస్టేబుల్‌. అయితే, తెగిపడిన విద్యుత్‌ వైరు తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ వీరస్వామి (45) మృతి చెందాడు. మృతుడు వీరస్వామి గండిపేట వాసిగా గుర్తించారు. మృతుడి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా గంగారం..యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో మిత్రుడిని కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news