వేసవికాలంలో రకరకాల సమస్యలు కలుగుతుంటాయి. ఎక్కువగా డిహైడ్రేషన్ వంటి ఇబ్బందుల్ని వేసవిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నిజానికి వేసవికాలంలో జీలకర్ర వాటర్ తాగడం వలన చాలా ప్రయోజనాలని పొందొచ్చు. చాలా మంది వేసవి కాలంలో డ్రింకులు లస్సి బటర్ మిల్క్ షర్బత్ ఇలా ఎవరికి నచ్చిన పానీయాలని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో ఇవే కాదు జల్ జీరా ని కూడా తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వివిధ సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది.
జల్ జీరా ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు ఉండవు జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు దీనిని తీసుకోవడం మంచిది. జీలకర్ర నీళ్ళని రెగ్యులర్ గా తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. కాన్స్టిపేషన్ వంటి ఇబ్బందులు ఉండవు. జల్ జీరా ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. విటమిన్ సి కూడా అందుతుంది వివిధ సమస్యలను దూరంగా ఉండొచ్చు.
ముఖ్యంగా వేసవికాలంలో ఎండ వేడి విపరీతంగా ఉంటుంది డిహైడ్రేషన్ చెమట బారిన పడటం ఇలాంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు రెగ్యులర్ గా జీలకర్ర వాటర్ తీసుకోవడం వలన ఈ సమస్యలు ఉండవు. ఒళ్ళు చల్లగా ఉంటుంది. ఈ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. జీలకర్ర వాటర్ ని తీసుకోవడం వలన ఆకలి కూడా తగ్గుతుంది బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.