తెలంగాణాలో కరోనా వర్సెస్ కేసీఆర్…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ ఇప్పుడు పూర్తిగా కట్టడి అయిపోయింది. గత నాలుగు రోజులుగా వరుసగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం కేవలం 2 కేసులు మాత్రమే తెలంగాణాలో నమోదు అయ్యాయి. రోజు రోజుకి కరోనా వైరస్ విషయంలో తెలంగాణా సర్కార్ ఎక్కడిక్కడ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది. లాక్ డౌన్ అమలు విషయంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ కఠినం గా అమలు చేయిస్తున్నారు.

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో లాక్ డౌన్ చాలా కీలకం. దాన్ని చాలా సమర్ధవంతంగా అమలు చేయడమే కాకుండా ప్రజలకు కరోనా ఎంత ప్రమాదం అనేది స్పష్టంగా చెప్పారు కేసీఆర్. ఇక వైద్య రంగ౦ కూడా తెలంగాణాలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వచ్చింది. రోజు రోజుకి కరోనా కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా అనుమానాలు ఉన్న వాళ్ళను ఆస్పత్రులకు తీసుకొచ్చింది.

వేలాది మందిని ప్రభుత్వం క్వారంటైన్ చేస్తూ వస్తుంది. నిన్న కేవల౦ అక్కడ రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీనిపై తెలంగాణా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నా సరే తెలంగాణాలో కేసీఆర్ కట్టడి చేస్తున్న విధానం చూసి షాక్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రిగా ఆయన రాత్రి 12 గంటల వరకు కరోనా విషయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

సూర్యాపేట, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంది. ముందు అక్కడి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో కరోనా కట్టడి అయినట్టే అని భావించిన కేసీఆర్ ఈ విషయంలో ఎవరిని అయినా సరే తప్పించడానికి రెడీ అయ్యారు. లాక్ డౌన్ ని అమలు చేయని పోలీసుల మీద కఠినం గానే వ్యవహరించింది సర్కార్. దీనితో ఇప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. నేడు కేసులు ఏమీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news