తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్ – 1, పోలీస్, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టులకు మే 2 నుంచి 31 వ తేదీ వరకు పోలీస్, ఇతర యూనిపాం పోస్టులకు మే 2 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ, పోలీస్ నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆన్ లైన్ దరఖాస్తు లింకును అందుబాటులోకి తీసుకురానున్నాయి.
దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఉద్యోగ ప్రకటనల్లో స్పష్టత ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉద్యోగాల ప్రకటనలను దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్ లో సవరణ చేసుకున్న, కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులని కమిషన్ పేర్కొంది.