తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీజేఆర్ కుమార్తెను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్ తో వెలిశాయి అని అన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనకాడటం లేదని, చివరి శ్వాస వరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారని కొనియాడారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణా లో వాటా దక్కిందన్నారు.

జంటనగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారని, కానీ ఇప్పుడు కొందరు తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నగరంలో పేదలకు ఇల్లు, ఇళ్ళ పట్టాలు ఇప్పించారని కొనియాడారు.పీజేఆర్ లేని లోటు తెలంగాణాలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ బహిష్కరించినా.. ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదన్నారు.పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారు అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ లో విజయా రెడ్డికి మంచి గౌరవం తగ్గుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.