సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ కు డిప్యూటీ సీఎం కౌంటర్..!

-

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు  క్షమాపణ చెప్పాల్సింది పోయి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురుదాడి చేయడం సరికాదు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై BRS ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తాం. BRS ప్రభుత్వ హయాంలోనే కాలేశ్వరం సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారు. నీళ్లు రాకుండానే కాలేశ్వరం కృంగిపోయింది. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగింది.

నాగార్జునసాగర్ డెత్ స్టోరేజ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే మరేం వస్తాయి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కట్టింది మీ ప్రభుత్వ హయాంలో కాదా అని ప్రశ్నించారు. అలాగ మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా BRS ప్రభుత్వం నిర్మించింది.. ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నాం. ఇంజనీర్లు చెప్పింది కాదని కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాలేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైంది అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version