లైంగిక వేధింపుల కేసులో డీఎంహెచ్ఓ అరెస్ట్..!

-

ప్రస్తుతం రోజు రోజుకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంటి నుంచి మొదలు కొని ఆఫీస్, వారు పని చేసే చోట ఇలా నిత్యం ఏదో ఒక చోట వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అవి మాత్రం చుట్టాలుగా మారిపోతున్నాయి. తాజాగా ఈ సంఘటనను చూస్తే.. ఇట్టే అర్థం అవుతుంది. ఓ డీఎంహెచ్ ఓ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం వినడానికి చాలా విచిత్రంగా ఉంది.

 

ప్రాణాలు కాపాడే డాక్టర్ ఇలా వ్యవహరిస్తే.. మన సమాజం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. వివరాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ గా పని చేసే డి. లక్ష్మణ్ సింగ్ ని లైంగిక వేధింపుల కేసులో  పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదు అయ్యాయి.  విచారణ అనంతరం ఆయనను తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. డీఎంహెచ్ఓ కోర్టులో హాజరుపరచగా.. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. లక్ష్మణ్ సింగ్ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు పలు కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version