హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో డ్రగ్స్ ని అరికట్టాలని ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో, తమ దందా నడుపుకోవడానికి కేటుగాళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని పట్టుకుంటున్నా ఎవరూ వెనకడగు వేయడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరొక డ్రగ్స్ రాకెట్ ని పట్టుకున్నారు అధికారులు. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు.

వీరి నుండి కిలో గంజాయితో పాటు, ndma కూడా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. మత్తు మందు, mdma, గంజా, కట్ లీవ్స్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు అధికారులు. నగరంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లకు యమన్ దేశస్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఈ యమన్ దేశస్తులు డ్రగ్స్  బిజినెస్ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ  ముగ్గురు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారన్న దాని మీద ఆరా తీస్తున్నారు అధికారులు.