ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం పంచముఖ లక్ష్మీ గణపతి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు… ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. ఈసారి మాత్రం పూర్తిగా మట్టితోనే 50 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ లో ఆవిష్కరించనున్న గణేశుడి… రూపానికి సంబంధించిన నమూనాను గణేష్ ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. పంచముఖ లక్ష్మీ గణపతి కి ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రీ దేవి అలాగే కుడివైపున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చేలా రూపకల్పన చేయనున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు కరోనా బారిన పడటం.. ఉద్యోగాల్లోకి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పండితులు విఠల్ శర్మ సూచనలు మేరకు ఈ అవతారంలో ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు రాజకుమార్ తెలిపారు.