తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కలకలం

-

క్యాసినో ఏజెంట్ల ఇళ్లపై ఈడీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. జూదం మాటు విదేశాలకు నిధులు మళ్లించారన్న సమాచారంతో హైదరాబాద్​లో 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ సోదాలతో కొందరు ప్రముఖుల్లో వణుకు పుట్టింది.


ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణ మొదలు విదేశాల్లోనూ ప్రత్యేక ఈవెంట్ల పేరుతో జూదమాడించేందుకు జనాన్ని తరలిస్తున్న క్యాసినో ఏజెంట్లు(టూర్ ఆపరేటర్లు) ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు రాజకీయ, వ్యాపారవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కొందరు ప్రముఖులు జూదం ఆడేందుకు విదేశాలకు వెళ్లిన వివరాలన్నీ ఈడీ సోదాల్లో బయటపడటమే ఇందుకు కారణం.

ప్రవీణ్                                                                                                           మాధవరెడ్డి

గోవాలో క్యాసినోలు నిర్వహించడంతోపాటు నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజులపాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారు. అక్కడి పరిస్థితులు బాగోకపోవడంతో నేపాల్‌కు తరలిస్తున్నారు.

బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు జరగ్గా.. సైదాబాద్‌లోని చీకోటి ప్రవీణ్‌ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌ తదితర మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు మొదలుపెట్టాయి. సాయంత్రం వరకూ జరిగిన ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news