డయబెటీస్‌ ఉంటే పెసరపప్పు తినొచ్చా..?

-

డయబెటీస్‌ ఉన్నవారు తినే ఆహారం మీద నియంత్రణతో పాటు.. అసలు ఏం తినాలో కూడా తెలుసుకుని ఉండాలి. అపోహాలకు వాస్తవాలకు వ్యత్యాసాన్ని గుర్తురెగాలి.. మనకు ఏదైనా సమస్య ఉంది అంటే ఉచిత సలహాలు ఇచ్చేటోళ్లు చాలా మంది ఉంటారు. అందరూ చెప్పినవి పాటిస్తే.. చివరికి మనకు ఏది తినాలన్నా భయమేస్తుంది. అసలే చెడు జరుగుతుంది అనే భయం మనిషిని ఏదైనా చేయిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి.. మందులు తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం, ఆహారాన్ని నియంత్రించడం చాలా అవసరం. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా చక్కెరను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు అయింది. అయితే వాటిల్లో పప్పులది ముఖ్యమైన పాత్ర.. ఇవి మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతాయట..అయితే పప్పులు అన్నీ చెక్కరను అదుపులో ఉంచలేవు.. కేవలం కొన్ని మాత్రమే..అవేంటంటే..

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పప్పులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చాలా కొద్ది మందికే తెలుసు. పప్పులో కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదిస్తాయి. ఇది చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. .

పెసర పప్పు చక్కెరను నియంత్రిస్తుందా..?

డయాబెటిక్ రోగులకు పెసర పప్పు వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పప్పులో గ్లైసెమిక్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు చక్కెరను త్వరగా నియంత్రిస్తాయి. పోషకాలు అధికంగా ఉండే పప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 ఉంటుంది. ఇది చక్కెరను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పెసర పప్పు అనేది తక్కువ-గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారం. ఇది శరీరంలో ఇన్సులిన్, రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పప్పును ఎలా తీసుకోవాలి

కూరగా..పెసరపప్పుతో పప్పు చేసుకోవచ్చు. మొలకల్లా పెసర పప్పును కూడా తినవచ్చు. పెసర పప్పును ఉడికించి దాని నీటిని తాగవచ్చు. పెసర పప్పు నీరు బలహీనతను తొలగిస్తుంది. చక్కెరను నియంత్రిస్తుంది. పెసరపప్పుతో కిచిడీ కూడా చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా పెసరప్పును వాడితే షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.

ఈ ఆర్టికల్‌లో రాసిన సమాచారం వైద్యులు, ఆరోగ్య నిపుణులు దృవీకరించిందే.. వీటితో ‘మనలోకం’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు

Read more RELATED
Recommended to you

Latest news