విద్యాశాఖ బిగ్ మిస్టేట్.. నిరుద్యోగికి నిరాశ..!

-

తెలంగాణ విద్యాశాఖ అధికారులు చేసిన ఓ తప్పిదానికి ఓ నిరుద్యోగి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇటీవల తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో సెలక్ట్ అయిన వారికి ఎల్బీ స్టేడియంలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. అయితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన కారంగుల సాయిరెడ్డి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రేయింబవళ్లు కష్టపడి చదివాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో డీఈవో కార్యాలయం నుంచి ఫోన్ రాగానే అతని ఆశలు మరింత చిగురించాయి.

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి హైదరాబాద్ కి సీఎం చేతుల మీదుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన వారు బయలుదేరారు. ఎల్బీ స్టేడియం వెళ్లడానికి బస్సులకు అతికించిన సెలెక్టెడ్ లిస్ట్ లో సాయిరెడ్డి పేరు ఉంది. అతను సంతకం చేసి హైదరాబాద్ వెళ్లాడు. బస్సులో కూర్చున్న అభ్యర్థులకు అటెండెన్స్ కూడా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం ముగిసిన తరువాత సాయిరెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. జిల్లా విద్యాధికారి రాజును వివరణ అడగ్గా.. చిన్న మిస్టేక్ వల్ల ఒకరికి రావాల్సిన ఉద్యోగం సాయిరెడ్డికి వచ్చిందని సమాధానం చెప్పడం గమనార్హం. కలెక్టర్ ను కలిసేందుకు వెళ్లగా.. అందుబాటులో లేకపోవడంతో ఇన్వార్డ్ లో తన ఫిర్యాదును ఇచ్చారు. తనకు న్యాయం జరగాలని బాధితుడు కంటతడి పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version