టిఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే – జీవన్ రెడ్డి

-

టిఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఏక్నాథ్ షిండే గా శ్రీనివాస్ యాదవ్ ని తెచ్చావు కదా?అని నిలదీశారు .దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి.. ఎన్నికలకు మేము సిద్దమనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ కు ఛాలెంజ్‌ విసిరారు. ఎక్నాధ్ షిండే నే తెచ్చింది బీజేపీ అని.. కెసిఆర్… ప్రతిపక్షంలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చాడని ఆగ్రహించారు.

దమ్ము ఉంటే..రద్దు చెయ్యి… గుజరాత్ తో పాటు ఎన్నికలు పెట్టించే బాధ్యత నాది… దమ్ముంటే ప్రభుత్వం రద్దు చేసి రా అని ఛాలెంజ్‌ చేశారు. కెసిఆర్ ..మోడీ ఇద్దరు దొంగలేనని…. వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మళ్లించే పనిలో కెసిఆర్ ఉన్నాడని.. మొన్నటి వరకు బీజేపీ నీ నెత్తిన ఎత్తుకుని తిరిగింది కెసిఆర్ కాదా ?అని నిలదీశారు. తెలంగాణ కు ఏం వద్దు.. మీ ప్రేమ ఉంటే చాలు అన్నది కెసిఆర్ కదా ? మోడీ అసమర్డుడో.. కాదో కానీ కెసిఆర్ అయితే అసమర్థుడని ఫైర్ అయ్యారు. విభజన హామీలను అమలు చేయించడం లో విఫలం అయ్యాడని… మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news