కెసిఆర్.. నీ భరతం పట్టే సమయం వచ్చింది – ఈటెల రాజేందర్

-

కెసిఆర్ భరతం పట్టే సమయం వచ్చిందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని.. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ వద్ద ఆనాటి విద్యార్థులపై తూటాలు పేల్చితే 7 గురు విద్యార్థులు రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారని గుర్తు చేశారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఏపీ ఏర్పడితే… 1969 వరకు మలి దశ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రోళ్లు కొల్లగొడుతున్నారనే నినాదంతో ఉద్యమిస్తే… 369 మంది ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలు ప్రాణత్యాగం చేశారని అన్నారు. 2001 నుండి 2014 వరకు పార్టీలకు, జెండాలకు, రాజకీయాలకు అతీతంగా మూడో దశ ఉద్యమం జరిగిందన్నారు. ఉస్మానియా వర్శిటీలో పోరాట బొడ్రాయిని పెట్టి ఉద్యమించిందని.. సామాన్యుడిని నుండి పెద్దల దాకా జేఏసీని ఏర్పాటు చేసుకుని నీళ్లు – నిధులు – నియామకాల పేరుతో ఉద్యమించామన్నారు.

“తెలంగాణ వచ్చినంక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్దిక మంత్రిగా నేనే అసెంబ్లీలో ప్రకటించా. అవన్నీ భర్తీ చేస్తామని ప్రకటించి. ఐటీ, ఫార్మాసహా హైదరాబాద్ కంపెనీలతోపాటు సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డమో… వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కలం పోటుతో 17 వందల మందిని తీసేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరిస్తే 39 మంది కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను కుదించేశారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా…ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారు. చివరకు టీఎస్పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా? గత 4 ఏళ్లలో 11 వేల కు మించి ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేసీఆర్… దీనినిబట్టే నిరుద్యోగులపట్ల కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవాలి. చదువుకున్న పిల్లలంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతో ఎన్నికల ఏడాది వస్తున్నందున వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో బిజీగా ఉండాలని నోటిఫికేషన్లు ప్రకటించారే తప్ప వాళ్లపై ప్రేమతో కాదు.

టీఎస్సీఎస్సీలో 6 పరీక్షలు ప్లాన్ చేస్తే… అవన్నీ లీకై 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారు. నిజాయితీగా చదువుకుంటే ఉద్యోగం రాదనే స్థితికి తీసుకొచ్చారు. దీనిపై ఉద్యమిస్తున్న ఉస్మానియా, కాకతీయ విద్యార్థులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ భరతం పట్టే సమయం వచ్చింది… నీ చెంప చెళ్లుమన్పించే సమయం వచ్చింది. మాలాంటి వాళ్లకు వచ్చే నిరుద్యోగులకు పైరవీలు ఉండవు… కష్టపడి చదివే వాళ్లకు ఉద్యోగాలొస్తాయని మేం చెబుతుంటే…. అందుకు భిన్నంగా పేపర్ లీక్ చేస్తూ ఉద్యోగాలను దోచుకుంటున్నరు.

టీఎస్సీఎస్సీ కమిషన్ ఛైర్మన్ ను నియమించింది కేసీఆరే కదా… నమ్ముకున్న వాళ్లు ఎందుకు మోసం చేశారో ఆలోచించండి. 30 లక్షల మంది యువత కన్నీళ్లు పెడుతున్నారు. కత్తులు నూరుతున్నారు. ఈ సర్కార్ కు కనువిప్పే సమయం వచ్చింది. కేసీఆర్ సర్కార్ కూలిపోవడానికి ఎంతో దూరంలో లేదు… అధికారాన్ని తీసేసే సత్తా తెలంగాణ ప్రజలకే ఉంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో పేపర్ లీకేజీ, నియామకాలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వండి… మీ సిట్ పై ప్రజలకు నమ్మకం లేదు. మియాపూర్ భూములపైనా, నయీం డైరీ, డ్రగ్స్ పై సిట్ వేస్తే ఏమైంది?

నీ చెప్పుచేతుల్లో ఉండే అధికారులను సిట్ రూపంలో నియమించి నివేదికలను దాచుకుంటున్నారు. అందుకే సిట్టింగ్ జడ్జితో సంపూర్ణంగా విచారణ జరిపించాల్సిందే. అప్పుడే లీకేజీ బాధ్యులెవరో తేలుతుంది. లీకేజీకి సంపూర్ణ బాధ్యత కేసీఆర్ ఫ్రభుత్వమే తీసుకోవాలి. లిక్కర్ స్కాంలో బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారే తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తారు… ఇప్పటివరకు కళ్లు నెత్తికెక్కి ఉన్న వ్యవస్థలను ఎట్లా నీరుగారుస్తున్నరో చూస్తున్నాం… అందరం కలిసి కేసీఆర్ సర్కార్ పై కలిసి పోరాడతాం… సర్కార్ అక్రమాలపై బీజేపీకి సంపూర్ణ సమాచారం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయా సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తాం” అన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news