బండి సంజయ్, రాజాసింగ్ ల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఈటెల రాజేందర్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని ఆరోపిస్తూ నిన్న కవిత ఇంటిదగ్గర బిజెపి కార్యకర్తలు నిరసనగ దిగారు. వారి అక్రమ అరెస్టుకి నిరసనగా దీక్ష చేయాలని నేడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ని దీక్ష భగ్నం చేసి అరెస్టు చేశారు పోలీసులు.

మరోవైపు మొహమ్మద్ ప్రవక్త పై రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పద వీడియో పై పోలీసులు రాజా సింగ్ ని అరెస్టు చేశారు. రాముడిని కించ పరుస్తూ షో చేసిన మునవర్ ఫారూఖీ హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన షో జరిపించారని ఆగ్రహిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు రాజా సింగ్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజసింగ్ ల అరెస్టులను తీవ్రంగా ఖండిచారు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్.

వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసులతో, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంజారాహిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఉన్న 29 మందిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేసారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news