దళిత బంధు పథకానికి అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు – కోమటిరెడ్డి

-

దళిత బంధు పథకానికి అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బొమ్మలరామారం మండలం రామలింగం పల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం తో పాటు రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అనేది కేవలం ఎన్నికల వరకేనని.. ఆ తర్వాత అసలు ఈ పథకాన్ని కొనసాగించలేరని వెంకట్ రెడ్డి అన్నారు. అహ్మదాబాద్ ను ఆదాని బాద్ గా చేసుకో అంటున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో చేస్తుంది అదే కదా అని ప్రశ్నించారు.

మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలే అని.. ఇద్దరూ దోచి పెట్టేది ఆధానీలకే.. దానికి నేనే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు. సింగరేణి కోల్డ్ మైన్ లో 40 వేల కోట్లు అవినీతిని త్వరలోనే బయటపెడతామని అన్నారు. సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఆ కాంట్రాక్టు నిలిపివేసి 40 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడుతానని తెలిపారు. ఒరిస్సాలోని నైని కోల్ మైన్ ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి అప్పగిస్తే 20 వేల కోట్లు ఉన్న కాంట్రాక్టును 60 వేల కోట్ల వరకు పెంచింది కేసీఆర్, కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news