పార్టీలో అందరూ బలగం సినిమా తరహాలో కలిసికట్టుగా పనిచేయాలి – VH

-

బిజెపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. మోడీ వచ్చాక పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి అనర్హత వేటు వేసి.. ఇల్లు కాళీ చేయించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ యువత కోసం పోరాటం అంటున్నాడు… మీరు ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి బండి సంజయ్..? అని నిలదీశారు.

బీసీలకు సమయం ఆసన్నమైందన్నారు విహెచ్. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి గ్రామంలో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో మోడీ చూడలేకే బయటకు పంపారని విమర్శించారు. బిజెపి ఓట్ల రాజకీయం తప్ప ఏం చేయలేదన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచి అన్నారు. ఇక పార్టీలో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూన్నారని.. పార్టీలో అందరూ బలగం సినిమా తరహాలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news