ధరణీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో చర్చ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా ధరణీ చట్టం మూడు తలలతో మొదలై.. 33 తలలతో అవతరించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సమయంలో ఎక్కడికి వెళ్లినా ధరణీ సమస్యల గురించే వివరించారు. పాదయాత్రలో చెప్పారు.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యంలో ధరణీని బంగాళఖాతంలో వేస్తామని చెప్పారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ధరణీతో సామాన్యులు అవస్థలు పడ్డారు. ధరణీ వచ్చిన తరువాత ప్రతీ గ్రామంలో సమస్యలే. అప్పటి సర్కార్ పెద్దల కోసమే ధరణీని తీసుకొచ్చారు.
ధరణీ పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. ధరణీ సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారు. చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా వారి సమస్యలు పరిష్కారం కాలేదు. సాదా బైనామాలకు నోటిఫికేషన్ ఇచ్చి ధరణీలో ఆ కాలమే పెట్టలేదు. ధరణఈతో కేసీఆర్ ప్రజలను దగా చేశారు. ధరణీతో 18లక్షల ఎకరాల భూమిని పక్కకు పెట్టారని తెలిపారు మంత్రి పొంగులేటి.