తెలంగాణ మహిళలకు ఉచితంగా ఏడాది 2 చీరలు – సీఎం రేవంత్‌

-

తెలంగాణ మహిళలకు ఉచితంగా ఏడాది 2 చీరలు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరిగింది. చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. నేతన్నకు చేయూత పథకం కింద రూ.290 కోట్ల నిధులు విడుదల చేశారు.

Funds of Rs.290 crores have been released under Netannaku Cheedoo scheme

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల కంటే.. నాణ్యమైన చీరలు అందిస్తామని వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చీరలు చేయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. అలా వచ్చిన చీరలను ఏడాది రెండు చొప్పులు తెలంగాణ మహిళలు ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version