థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌.. హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షణ

-

హైదరాబాద్ నుంచి వెళ్లి థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ చేసిన వారిపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో పాటు పలువురిని అరెస్టు కూడా చేసింది. అయితే తాజాగా థాయ్‌లాండ్‌ పటాయాలో గ్యాంబ్లింగ్‌లో పట్టుబడిన 93 మందికి స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు విధించిన జరిమానా చెల్లించగా పోలీసులు అందరి పాస్‌పోర్టులు తిరిగి ఇచ్చేశారు. ఇందులో చీకోటి ప్రవీణ్‌, చిట్టి దేవేందర్‌రెడ్డి, మాధవరెడ్డి సహా 83 మంది తెలుగు వాళ్లు స్వస్థలాలకు చేరుకున్నట్టు సమాచారం.

థాయ్‌లాండ్‌లో నిర్వహించే క్యాసినోను హైదరాబాద్‌లోని చీకోటి ప్రవీణ్‌ అనుచరులు పర్యవేక్షించేలా ఏషియా పటాయా కన్వెన్షన్‌ హాల్లో సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు థాయ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. థాయ్‌ పోలీసులు దాడి చేయగానే వెంటనే హైదరాబాద్‌లో ఉన్న లాప్‌ట్యాప్‌ల నుంచి డిస్‌కనెక్ట్‌ అయినట్టు గుర్తించారు. గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన పరికరాలన్నీ భారత్‌ నుంచే తెచ్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news