TSPSC పేపర్ లీక్ కేసు.. వారి కోసమే క్వశ్చన్ పేపర్ల కొనుగోలు

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్టు చేసి విచారించారు. అయితే సిట్ విచారణలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ మాత్రం నోరు విప్పడం లేదనీ సిట్ అధికారులు తెలిపారు. మిగతా నిందితులు తప్పు చేశామనే అభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

కుటుంబసభ్యుల జీవితాలు స్థిర పడతాయన్న ఉద్దేశంతోనే ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించినట్టు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో అధికశాతం మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన వారే ఉన్నారు. టీఎస్పీఎస్సీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాక్యానాయక్‌ తోపాటు మొత్తం 19 మంది అరెస్టయ్యారు. నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా రాజశేఖర్‌రెడ్డి, సురేష్‌, రాజేందర్, రమేశ్‌ ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సర్కారు విభాగాల్లో పనిచేస్తున్నారు.

వారంతా లీకైన ప్రశ్నపత్రాలను కుటుంబ సభ్యుల కోసమే వివిధ మార్గాల్లో దక్కించుకున్నామని చెప్పినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినా అమాయకుడినంటూ పదేపదే నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news