Gold Price Today : బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది..బంగారం ధరలు.. భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.
అయితే.. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ. 68,300గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర రూ. 2000 తగ్గి రూ. 99,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.