రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధుపై సీఎం కీలక ఆదేశాలు

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు సచివాలయంలో శాఖల వారిగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది. ఎంత ఖర్చు అయిందనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ పెట్టుబడుల నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 

రైతులకు పంట పెట్టుబడి సాయం కింద నగదు చెల్లింపులు ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన రైతుభరోసా పథకానికి ఇంకా విధి, విధానాలు రూపొందించకపోవడంతో రైతులకు పంట పెట్టుబడి చెల్లింపు ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతులకు గతంలో మాదిరిగానే పంట పెట్టుబడి సాయం కింద అందించాలని సీఎం ఆదేశించారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version