భూమి లేని పేదలకు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. తాజాగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 4 చోట్ల ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరగనుంది. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం. అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు.
రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని.. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆరోపించారు. తాము అప్పులు చేసినట్టు ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని.. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.54వేల కోట్లు అప్పులు చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎవ్వరూ ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ నిధులను ఏడాది లోపే వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.