కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సు జర్నీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మహిళలకు మరో పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. 63లక్షల మంది మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం రూపకల్పన చేసినట్టు వెల్లడించింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటిచింది ప్రభుత్వం.
ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది 5,000 గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు ప్రయోజనం చేకూరే విధ:గా కార్యచరణ రూపొందిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరించే విధంగా కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో రుణబీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద సభ్యురాలు మరణించినట్టయితే.. ఆమె పేరు పై ఉన్నటువంటి అప్పు గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని తెలిపారు.