క్రికెట్ ఫ్యాన్స్ కి ఆర్టీసీ గుడ్ న్యూస్..!

-

క్రికెట్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 25 నుండి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ క్రమంలో క్రికెట్ ని చూడడానికి భారీగా క్రికెట్ అభిమానులు వస్తూ ఉంటారు. అధికారులు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలానే ఉప్పల్ స్టడీ మొత్తాన్ని కూడా కొత్తగా రూపుదిద్దారు. ఈ మ్యాచ్ కి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.

దీనిలో భాగంగానే క్రికెట్ అభిమానులకి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది రేపటినుండి జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చెప్పింది. మొత్తం హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాల నుండి దాదాపు 60 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఈ బస్సులు ఉదయం ఎనిమిది గంటలకి మొదలై రాత్రి 7:00కి స్టేడియం నుండి ఈ బస్సులు బయలుదేరుతాయి ఈ ప్రత్యేక బస్సుల ద్వారా క్రికెట్ అభిమానుల్ని టిఎస్ఆర్టిసి క్రికెట్ వీక్షించడానికి వెళ్ళమని కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version