కేసీఆర్ సర్కార్‌ కీలక నిర్ణయం..మధ్యాహ్నం భోజన కార్మికుల జీతం పెంపు

-

కేసీఆర్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళా వంట కార్మికుల నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3,000లకు పెంచారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 8 జారీ చేశారు.

వంట కార్మికులకు ప్రస్తుతం కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కలిపి నెలకు రూ.1000 చొప్పున గౌరవ వేతనాన్ని అందిస్తున్నారు. తమ వేతనం 2008 నుంచి పెరగలేదని, జీతం పెంచాలని ఎప్పటినుంచో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గత మార్చి 15న వారి వేతనాన్ని మూడు వేలకు పెంచుతామని శాసనసభలో ప్రకటించారు. కానీ దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయకపోవడంతో కార్మికులు ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news