తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ… స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇవాళ్టి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు వాటిని ఇచ్చేందుకు ఏకంగా రూ. 10 కోట్లు మంజూరు చేసింది విద్యాశాఖ. ఉదయం 8 గంటలకు స్కూలుకు వచ్చి ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటలు అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ స్నాక్స్ కోసం… ఒక విద్యార్థికి 15 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తుంది ప్రభుత్వం.