తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. నా జాబ్ అంతా ఈజీ కాదు !

-

సీఈఓ క్లబ్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్స్ లో గో బియాండ్ రీట్రీట్-2022 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ తమిళిసై, నిర్మాత అల్లు అరవింద్, వివిధ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ… ఇండియా గ్రోత్ లో కంపెనీల సీఈఓలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని.. మనం కరెన్సీని కౌంట్ చేయగలం కానీ క్యాలరీస్ ని కాదని పేర్కొన్నారు.

ఆరోగ్యము విషయంలో కూడా సీఈఓ క్లబ్ చేసిన ప్రోగ్రామ్స్ ని డాక్టర్ గా అభినందిస్తున్నాని… పాజిటివ్ గా థింక్ చేయాలి, ఈ ఆలోచన మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని వెల్లడించారు. ప్యాండమిక్ మూడేళ్ళ తరువాత హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి డైరెక్ట్ ఫ్లైట్ లో వెళ్తున్నాను.. నేను దేశంలోనే అతిచిన్న వయస్కురాలైన గవర్నర్ ను అని చెప్పారు. రెండు రాష్ట్రాలను చూసుకోవాలి, మోస్ట్ టెన్షన్స్ కలిగిని జాబ్ ఇదని.. వర్క్ ని ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నానని పేర్కొన్నారు.

ఎన్ని డిగ్రీలు ఉన్న కూడా రోజు నేర్చుకోవడం చాలా ముఖ్యమని.. ప్రతిరోజు మన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చారు. కంపెనీల నిర్మాణంలో సీఈఓల పాత్ర కీలకమని.. మహిళలు కూడా అనేక కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారని చెప్పారు. మహిళలు మరింత ముందుకు వెళ్ళాలి.. నూతన ఆవిష్కరణలను సృష్టించేందుకు ఆలోచించాలన్నారు. ప్రతిదాని నుంచి ఏదోఒక కొత్త అంశాన్ని నేర్చుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news