బిజెపి డైరెక్షన్ లోనే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించింది: జగ్గారెడ్డి

-

రాజకీయంలో భాగంగానే గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించిందని.. దాని వల్ల ఉపయోగం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అది కేవలం నామమాత్రపు దర్బార్ అని అన్నారు. గవర్నర్ జిల్లా కు పోతే కలెక్టర్, ఎస్పీ రాలేదు.. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు..ఆమెకు జరిగిన అవమానం మీదనే చర్యలు లేవు.. ఇక మహిళలకు ఏం న్యాయం చేస్తారు అని అన్నారు. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టడం వెనుక బిజెపి, మోడీ ఉన్నారని ఆరోపించారు జగ్గారెడ్డి.

తెలంగాణలో గవర్నర్ పాలన వస్తే కాంగ్రెస్ కి అన్యాయం జరుగుతుందన్నారు. గవర్నర్ కేంద్రం ఏం చెప్తే అదే వింటారని, గవర్నర్ పాలన కోరడం.. కాంగ్రెస్ ప్రమాదంలో పడ్డట్టే అని అన్నారు. తెలంగాణ రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవన్నారు జగ్గారెడ్డి.బిజెపి, ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీలు ప్రజలను ఎలా బతికించాలి అనేదే లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. కెసిఆర్ ని మోడీ.. మోడీ ని కేసీఆర్ తిట్టుకున్నట్టు నటిస్తున్నారని.. తెలంగాణలో ఎంఐఎం, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కలిసే రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news