‘గ్రేటర్ ‘ గ్రేట్ ఐడియా వేస్తున్న బీజేపీ ‘బండి’

-

టిఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేస్తూ, ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ బిజెపిలో తన మార్క్ స్పష్టంగా కనిపించాలనే తాపత్రయ తో బండి సంజయ్ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై రాజీలేకుండా పోరాటాలు చేస్తున్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీ నుంచి వేదపులు పెద్దగా ఉండవు అనే ఆలోచనతో ఉన్నారు. గతంతో పోలిస్తే బిజెపికి తెలంగాణలో ఆదరణ పెరిగింది అని బండి సంజయ్ నమ్ముతున్నారు. టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బండి సంజయ్ సందర్భం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.

bandi sanjay
bandi sanjay

ఇప్పుడు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలని చూస్తున్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం గా కనిపిస్తుందని, ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందనే విషయం తేలడంతో, బీజేపీకి రానున్న రోజుల్లో మరింత ఆదరణ పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని బండి సంజయ్ నమ్ముతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పూర్తిగా దృష్టిసారించడం, వందకు పైగా స్థానాలలో పార్టీకి విజయాన్ని అందించాలనే ఆలోచనతో  ఎక్కువగా గ్రేటర్ పరిధిలో పర్యటిస్తూ, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ లో కేటీఆర్ హవా కనిపించకుండా, బిజెపి బలం పెంచుకునేందుకు బండి సంజయ్ ప్లాన్ చేసారు.

గ్రేటర్ పరిధిలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉండడం, మరికొంతమందికి పోటీ చేసే అవకాశం దక్కకపోవడం, పార్టీ తీరుతో ఆగ్రహంగా ఉండడం, ఇవన్నీ పరిశీలించిన బండి సంజయ్ అటువంటి అసంతృప్తులను గుర్తించి బిజెపిలో చేర్చకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి తీసుకురావాలనే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది టిఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరందరినీ త్వరలో ఒక వేదిక పైకి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని టిఆర్ఎస్ కు క్రెడిట్ దక్కకుండా చేయాలనే విధంగా సంజయ్ అభిప్రాయపడుతున్నారు. దీనికి బిజెపి అధిష్టానం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుండటంతో, గ్రేటర్ లో బిజెపి బండి ని పరుగులు పెట్టించాలనే సంకల్పంతో  సంజయ్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news