జిల్లాగా హన్మకొండ… ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ

-

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇటీవల వరంగల్‌ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ హన్మకొండను జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆయా జిల్లాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల కలెక్టర్లకు రాతపూర్వకంగా తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

 

నూతన ప్రతిపాదిత హన్మకొండ జిల్లా:
రెవెన్యూ డివిజన్లు- 2
మండలాలు- 12
గ్రామాలు-139

హన్మకొండ రెవెన్యూ డివిజన్ లోని మండలాలు: హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేర్‌, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి
పరకాల రెవెన్యూ డివిజన్ లోని మండలాలు: పరకాల,కమలాపూర్‌ ,దామెర, నడికుడ,

నూతన ప్రతిపాదిత వరంగల్‌ జిల్లా:
రెవెన్యూ డివిజన్లు- 2
మండలాలు- 15
గ్రామాలు- 217

వరంగల్‌ రెవెన్యూ డివిజన్ లోని మండలాలు: వరంగల్‌, ఖిలా వరంగల్‌, గీసుకొండ, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం , ఆత్మకూరు, శ్యాంపేట
నర్సంపేట రెవెన్యూ డివిజన్ లోని మండలాలు: నర్సంపేట, చెన్నరావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ

ప్రాథమిక నోటిఫికేషన్‌ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు 30 రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేసిన అనంతరం అభ్యంతరాలను పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news