ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీజీ? : హరీష్ రావు సంచలన ట్వీట్

-

ప్రధాని మోడీ నిన్న పార్లమెంట్‌ లో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు? అని నిలదీశారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతి పక్షాలు డివిజన్ ఆడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు? అని నిలదీశారు.

పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..?అని ప్రశ్నించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోదీ గారు? రైతు‌ వర్గం‌ అంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..? అని ఆగ్రహించారు. ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్ గారు చేసిన పోరాటం,వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా. తెలంగాణ ప్రజల‌ ఆకాంక్ష‌ అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా.. అని ప్రశ్నించారు. ఇదెక్కడి‌ న్యాయం మోదీ జీ..అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news