గర్భిణీ స్త్రీలకు గుడ్‌న్యూస్‌.. ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’ పంపిణీ చేసిన హరీష్‌ రావు

-

గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కాసేపటి క్రితమే ‘కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌’ పంపిణీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. కడుపు లో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ అని, కాన్పు అయ్యాక ఇచ్చేది కేసీఆర్ కిట్ అని వివరించారు. ప్రతి గర్బినికి రెండు సార్లు ఇస్తామని.. దీని విలువ 2 వేలా రూపాయలు అని వివరించారు హరీష్ రావు.

కేసీఆర్ పనులు ఎక్కువ చేస్తున్నారు ..బీజీపీ మాత్రం పన్నులు ఎక్కువ వేస్తుందని.. పనులు చేయడం బిఆర్ఎస్ వంతు , పన్నులు వేయడం బిజెపి వంతు అని ఆగ్రహించారు హరీష్ రావు. శిశు , తల్లి మరణాలు తగ్గించి దేశం లో మూడో స్థానం లో ఉందని.. త్వరలో టిఫా స్కానింగ్ కూడా ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు హరీష్ రావు. బిఆర్ఎస్ వి న్యూట్రిషన్ పాలిటిక్స్ ..ప్రతిపక్షాల వి పార్టిషన్ పాలిటిక్స్ అని మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news