కెసిఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు 12 ఏళ్లు – హరీష్ రావు ఎమోషనల్

-

కెసిఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు 12 ఏళ్లు అని మంత్రి హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు. నవంబర్ 29, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ పేజీ రాసుకున్న రోజు. ‘తెలంగాణ తెచ్చుడో, కెసిఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29 న కెసిఆర్ ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దీక్షా స్థలికి వెళ్తుండగా, మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద కేసీఆర్ ను అరెస్టు చేశారు.

ఖమ్మం జైలుకి తరలించగా, 11 రోజులు దీక్ష చేశారు. నేటికీ 13 ఏళ్లు కాగా, టిఆర్ఎస్ నేడు దీక్ష దివాస్ గా నిర్వహిస్తోంది. అయితే దీక్ష దివాస్ సందర్భంగా హరీష్ రావు స్పందించారు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు కేసీఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు 12 ఏళ్ళు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన ఉద్యమ నేత కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news