ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందన

-

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ఘటనలు అత్యంత బాధాకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇటీవల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. బాధ్యులను ఉపేక్షించబోయేది లేదని చెప్పారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు.

తెలంగాణలో డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ఆయా శాఖల అధికారులతో సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, జీహెచ్‌ఎంసీ, కమిషనర్ లోకేష్, డీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఫీవర్‌ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news