హరీష్ రావు సైతం వణికిపోయేలా అక్కడేం జరుగుతోంది ?

-

తెలంగాణలో తమకు ఎదురే లేదని భావిస్తున్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు సైతం ఇప్పుడు వణుకు పుట్టేలా దుబ్బాక నియోజక వర్గంలో పరిస్థితులు ఉన్నాయి. విపక్షాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, దుబ్బాక లో ‘ కారు ‘ స్పీడును ఎవరు ఆపలేరు అంటూ ప్రగల్బాలు పలికిన టిఆర్ఎస్ అగ్రనేతలు అంతా, ఇప్పుడు అక్కడి నుంచి అందుతున్న నివేదికలను చూసి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకోవడంతో ఆయన టెన్షన్ అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల అయిపోయింది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీలు వేగాన్ని పెంచాయి.

ముఖ్యంగా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే విధంగా బిజెపి వెళ్ళిపోతుంది. మొన్నటి ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఇ ఓటమి చెందిన బీజేపీ జనాల్లో బలం పెంచుకుంటూ దూసుకెళ్ళిపోతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై ప్రజల్లో సానుభూతి ఉండడం, ఆయన గత ఎన్నికల్లో ఓటమి చెందినా, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండడం వంటివి ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక టిఆర్ఎస్ ఇక్కడ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను రంగంలోకి దించింది. అయితే స్థానికంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించడం, ఒకవేళ టిఆర్ఎస్ నుంచి అభ్యర్థిత్వం దక్కకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించడం, ఈ పరిణామాలన్నీ టిఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక అపజయం ఎదురైతే, ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు బలం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని టిఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. హరీష్ రావు దుబ్బాక బాధ్యతలు తీసుకోవడంతో, ఇక్కడ గెలుపోటములు ప్రభావం తన రాజకీయ భవిష్యత్తుపై తప్పకుండా పడుతుందని హైరానా పడుతున్నారట. అందుకే ఈ నియోజకవర్గం గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనాల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలు అప్పగించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు భయంతో పాటు, తమ పార్టీకి చెందిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారేమో అనే టెన్షన్ టిఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ కనుక టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందితే, దానికి పూర్తి బాధ్యత మంత్రి హరీష్ రావే తీసుకోవాల్సి ఉండడంతో ఆయన మరింత టెన్షన్ పడుతున్నారట.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news