రైతుబంధు నగదు రుణాలకు జమ చేస్తే ఊరుకోను..బ్యాంకర్లపై హరీశ్ రావు ఫైర్

-

పంట పెట్టుబడి కోసం సాయంగా రైతులకు తెలంగాణ సర్కార్ అందజేస్తున్న రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు బకాయిలు జమ చేసుకునే నెపంతో నిలిపివేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఈ విషయం కాస్త రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి చేరింది. దీనిపై మంత్రి స్పందిస్తూ బ్యాంకర్లను హెచ్చరించారు.

రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిలకు జమ చేసుకోవడంపై మంత్రి హరీశ్​​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని ఆదేశించారు. రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోరాదని స్పష్టం చేశారు. ఎస్ఎల్​బీసీ నిబంధనలను బ్యాంకర్లు అందరూ విధిగా పాటించాలని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news