అనవసర పరీక్షలు, మందులు రాయోద్దని తెలంగాణ రాష్ట్రంలోని డాక్టర్లకు మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగంతలు పెంచాము..పీజీ సీట్లు డబుల్ చేసామని.. మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు.
నెలకు మూడు నాలుగు ఎయిర్ అంబులెన్స్ ఇక్కడికి వస్తున్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. అత్యధిక ట్రాన్స్ ప్లాంట్ జరిగేది హైదరాబాద్ లోనేనని.. అరోగ్య శ్రీ కింద అత్యధికంగా 10 లక్షల వరకు ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద 1000 కోట్లు పేద ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. అనవసర పరీక్షలు చేయొద్దు, అనవసర మందులు వద్దు ప్రజల పై భారం మోపొద్దని పేర్కొన్నారు మంత్రి హరీశ్ రావు.