తెలంగాణ బిజేపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో బీజేపీ పనైపోయింది..డిపాజిట్లు కూడా రావన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పనైపోయింది.
బీజేపీలో ఉంటే గెలవడం ఏమో కానీ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేసీఆర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారాలను అభివృద్ధి చూపించి తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.