అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపి తీర్మాణంపై చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఎమ్మెల్యేల కొనుగోలే కారణమని కూనంనేని అసెంబ్లీలో చెప్పారు. సీఎం కేసీఆర్ లాంటి అన్ని తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యం కానీ ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు హామీలు ఇచ్చారన్నారు.
ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు. కూనంనేని సాంబ శివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగ్రెస్ కి మిత్ర పక్షం. ఇద్దరూ కలిసి పోటీ చేశారు. మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు. తాము అలా చెప్పినట్టు నిరూపించాలని చాలెంజ్ విసిరారు. గవర్నర్ స్పీచ్ పై కూనంనేని మాట్లాడితే బాగుంటుందని హరీశ్ రావు సూచించారు.