నాందేడ్ లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కపెట్టారా? – KCR

-

మేక్ ఇన్ ఇండియా నినాదం జోక్ గా మారిందని ఏద్దేవా చేశారు సీఎం కేసీఆర్. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా వచ్చే వస్తున్నాయన్నారు. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నాందేడ్ లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లేక పెట్టారా? అని అక్కడి ప్రజలను ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో చాలా చైనా బజార్లు ఉన్నాయని తెలిపారు. బిఆర్ఎస్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదనీ.. జీవన్మరణ పోరాటం అన్నారు.

దేశంలో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా వంచనకు గురవుతున్నారని తెలిపారు. భారత్ పేద దేశం కాదని… అమెరికా కంటే భారత్ ధనవంతమైన దేశం అన్నారు. మహారాష్ట్రలో ఇన్ని నదులు ఉన్నప్పటికీ నీటి కరువు ఎందుకు ఉందని ప్రశ్నించారు. స్వాతంత్రం తరువాత 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బిజెపి పాలించాయని.. ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు ఏం సాధించాయని ప్రశ్నించారు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని తిట్టుకుంటాయని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news