తెలంగాణతో తనకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు : రాహుల్ గాంధీ

-

తెలంగాణతో తనకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు అని కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ పెద్దపల్లి జిల్లాలో విజయభేరీ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పట్ల తమకు ప్రేమ, అప్యాయత, అభిమానం ఉంది అని తెలియజేశారు. తెలంగాణతో తనకు
కుటుంబ సంబంధం ఉందన్నారు.. నాకంటే ముందు నెహ్రు, ఇందిరా గాంధీ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం అని గుర్తుంది. 2004లోనే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇవ్వాలని హామీ ఇచ్చింది. ఆ తరువాత సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని 2014లో తెలంగాణ ఏర్పాటు చేశారు.

రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణను ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన శాఖలను వారి ఆధీనంలో ఉంచుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగింది.. మీ భూములను లాక్కున్నా.. మీకు లాభం జరిగిందా..? నీళ్లు వచ్చాయా..? ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు.ధరణీ పోర్టల్ విషయంలో భూములు లాక్కున్నారు. లక్ష రూపాయలు రుణమాఫీ ఎంత మందికి జరిగిందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news